కన్న తండ్రి కర్కశత్వం.. మద్యం మత్తులో కొడుకు హత్య

కలం, వెబ్​ డెస్క్​: మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి కొందరు మృగాలుగా వ్యవహరిస్తున్నారు. నిశాలో ఏం చేస్తున్నారో వారికే తెలియట్లేదు. ఫూటుగా మందు సేవించిన ఓ వ్యక్తి రక్తం పంచుకుని పుట్టిన కన్న కొడుకునే పొట్టన పెట్టుకున్నాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్​ లోని బోరబండ శిల్పినగర్​ లో చోటు చేసుకుంది. ఆదివారం రాత్రి విద్యాసాగర్​ (36) మద్యం మత్తులో తన ఐదేళ్ల కొడుకును విజయ్​ గొంతు నులిమి హత్యచేశాడు.

క్యాటరింగ్​ పనికి వెళ్లిన తల్లి దుర్గ ఇంటికి తిరిగి వచ్చే సరికి విజయ్​ విగత జీవిగా పడి ఉన్నాడు. విషయం చుట్టుపక్కల వారికి తెలియడంతో పోలీసులుకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న విద్యాసాగర్​ పరారైనట్లు తెలిసింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>