చౌటుప్పల్ హత్య కేసులో కీలక పరిణామం.. నిర్మల్‌లో నిందితుల అరెస్ట్!

కలం, నిర్మల్: హత్య చేసి భారీగా బంగారు, వెండి ఆభరణాలు, నగదుతో పాటు కారును అపహరించి మధ్యప్రదేశ్‌కు పారిపోతున్న నిందితులను నిర్మల్ జిల్లా పోలీసులు పట్టుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ (Choutuppal) లో అక్టోబర్ 31 అర్ధరాత్రి జోగిని రాళ్లబండి సుధాకర్ స్వామి (50) దారుణ హత్య (Murder) కు గురయ్యాడు. అనంతరం ఆయన వద్ద ఉన్న విలువైన ఆభరణాలు, నగదు, హరియర్ కారును అపహరించిన నిందితులు మధ్యప్రదేశ్‌కు పరారవుతుండగా నిర్మల్ జిల్లా పోలీసులు అడ్డుకున్నారు.

ఈ ఘటనపై సమాచారం అందుకున్న నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి ఆదివారం రాత్రి విధుల్లో ఉన్న పోలీసు సిబ్బందితో కలిసి గంజాల్ టోల్‌ప్లాజా వద్ద వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో పోలీసులను గమనించిన నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించగా అప్రమత్తమైన పోలీసులు వారిని వెంబడించి పట్టుకున్నారు. నిందితుల వద్ద నుంచి సుమారు 1.4 కిలోల బంగారం, 3 కిలోల వెండి, రూ.9 లక్షల నగదుతో పాటు హరియర్ కారును స్వాధీనం చేసుకున్నారు.

అనంతరం నిందితులను, స్వాధీనం చేసుకున్న సొత్తును తదుపరి విచారణ నిమిత్తం యాదాద్రి భువనగిరి జిల్లా పోలీసులకు అప్పగించారు. హత్య (Choutuppal Murder) కేసులో నిందితులను పట్టుకోవడంతో పాటు భారీ మొత్తంలో సొత్తును స్వాధీనం చేసుకున్న నిర్మల్ రూరల్ ఎస్సై లింబాద్రి, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల ప్రత్యేకంగా అభినందించారు.

Also Read : ఇంధన విప్లవం.. E-20 ఇథనాల్‌కు మొక్కజొన్న..!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>