SBI కస్టమర్లకు బిగ్ అలర్ట్.. రేపు ఈ సమయంలో యూపీఐ సేవలకు బ్రేక్!

కలం, వెబ్ డెస్క్: స్టేట్ బ్యాంక్ ఆఫ్​ ఇండియా కస్టమర్లకు బిగ్ అలర్ట్ జారీ చేసింది. ఎస్పీఐ ఖాతాలో లింక్ అయిన యూపీఐ సర్వీసులు (SBI UPI Services) రేపు బంద్ కానున్నట్లు పేర్కొంది. ఈనెల 4వ తేదీన సాంకేతిక కారణాల వల్ల అర్థరాత్రి 00.15 గంటల నుంచి 1 గంటల వరకు దాదాపు 45 నిమిషాల పాటు ఖతాదారులు యూపీఐ సేవల్లో అంతరాయం ఎదుర్కోనున్నట్లు వివరించింది.

ఈ సమయంలో ఖాతాదారులు యూపీఐ యాప్స్ లో ఎస్బీఐ ఖాతా ద్వారా పేమెంట్స్ చేయలేరు. అయితే కేవలం యూపీఐ పేమెంట్స్ మాత్రమే నిలిచిపోతాయని, ఆర్టీజీఎస్, నెఫ్​ట్, ఐఎంపీఎస్ ద్వారా యథావిధిగా ఖాతాదారులు పేమెంట్స్ చేసుకోవచ్చని సూచించింది. యూపీఐ లైట్ సేవలు మాత్రమే సాధారణంగా పనిచేస్తాయి. దీంతో ఖాతాదారులు యూపీఐ లైట్ ద్వారా సులభంగా పేమెంట్స్ చేసుకోవచ్చని తెలిపింది.

Also Read : కొండా సురేఖకు కేఏ పాల్ బంప‌ర్ ఆఫ‌ర్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>