కలం, వెబ్ డెస్క్: ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ (Konda Surekha) ఇష్యూ చర్చనీయాంశమవుతున్న విషయం తెలిసిందే. ఈ ఇష్యూపై గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Raja Singh) స్పందించారు. కాంగ్రెస్ అంటేనే అవినీతి అని, రేవంత్ రెడ్డి పాలనను చూస్తే ఈ విషయం అర్థమవుతోందని విమర్శించారు. డబ్బుల వాటా, పంపిణీలో తేడాలు రావడం వల్లే కొండా సురేఖను పార్టీ నుంచి బయటకు పంపించేందుకు కుట్రలు చేస్తున్నారని రాజాసింగ్ ఆరోపించారు. కాంగ్రెస్‌లో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలు, నేతల మధ్య విభేదాలకు ఆర్థిక అంశాలే ప్రధాన కారణమని రాజాసింగ్ అన్నారు.
Also Read : క్యాబినెట్ నుంచి కొండా సురేఖ బర్తరఫ్ !
Follow Us On : WhatsApp

