Mobile Popup Ad
Mobile Popup Ad

‘సత్తిబాబు బిర్యానీ’లో ఫుడ్ సేఫ్టీ తనిఖీలు.. అదిరిపోయే మార్క్స్

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌ పరిధిలోని హోటల్స్ పై ఫుడ్ సేఫ్టీ అధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేశారు. ఇందులో భాగంగా కొండాపూర్‌లోని కిమ్స్ హాస్పిటల్ సమీపంలో ఉన్న ప్రసిద్ధ ‘సత్తిబాబు బిర్యానీ’  (Satti Babu Biryani) హోటల్‌ను పరీక్షించిన ఫుడ్ సేఫ్టీ అధికారులు .. ఆ హోటల్ కు అదిరిపోయే మార్క్స్ ను ఇచ్చారు.

‘సత్తిబాబు బిర్యానీ’ హోటల్‌లో పలు ఆహార భద్రతా ప్రమాణాలను చక్కగా పాటిస్తున్నట్లు ఫుడ్ సేఫ్టీ బృందం గమనించింది. హోటల్‌లో శాకాహార (వెజ్), మాంసాహార (నాన్-వెజ్) పదార్థాలను వేర్వేరుగా నిల్వ చేస్తూ తగిన జాగ్రత్తలు తీసుకొంటున్నారని.. ఈగలను ఆకర్షించే ఫ్లై క్యాచర్లు అమర్చడంతో పాటు, మాంసం ఉత్పత్తులను శుభ్రం చేసి, సరిగ్గా ప్యాక్ చేసి ఫ్రిజ్‌లలో భద్రపరుస్తున్నారని తేల్చారు. సిబ్బందికి సంబంధించిన మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్లు, పెస్ట్ కంట్రోల్ (కీటకాల నివారణ) రికార్డులు, వాటర్ టెస్టింగ్ (నీటి నాణ్యత) నివేదికలు కూడా బాగున్నాయని తనిఖీల్లో తెలుసుకున్నారు.హోటల్ రికార్డులు, వెజ్-నాన్ వెజ్ సెగ్రిగేషన్ బాగుండడంతో ‘సత్తిబాబు బిర్యానీ’ హోటల్‌ కు ఏకంగా 92% మార్కులు ఇచ్చారు.

అయితే తనిఖీల సమయంలో కొన్ని ఆహార పదార్థాలపై మూతలు పెట్టకపోడాన్ని అధికారులు గమనించారు. దీంతో మూతలు మూసి ఉంచాలని, వాడుతున్న నెయ్యి ప్యాకెట్లపై సరైన లేబులింగ్ లేకపోవడంతో లేబుల్స్ కలిగిన ఉత్పత్తులనే వాడాలని అధికారులు సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>