కలం, నేషనల్ బ్యూరో : తమిళనాడు (Tamil Nadu) మరో కొత్త పార్టీ పుట్టుకొచ్చింది. ఇప్పటికే సినీ నటుడు విజయ్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వగా తాజాగా శశికళ (Sasikala)సైతం కొత్త పార్టీని స్థాపించారు. గత నెల 24న జెండాను రిలీజ్ చేసి పార్టీ పేరును మాత్రం సస్పెన్స్ లో పెట్టారు. అసెంబ్లీ ఎన్నికలకు టైమ్ దగ్గర పడుతుండడంతో జనంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు పార్టీ పేరును అనౌన్స్ చేశారు. పార్టీ జెండాలో తన నిచ్చెలి జయలలిత (Jayalalitha) ఫొటోతో పాటు దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్ (MGR), అన్నాదురై ఫొటోలను కూడా పెట్టుకున్నారు. తమిళనాడు ద్రవిడ పార్టీలు వాడే ఎరుపు, నలుపు రంగులనే ఆమె కూడా ఎంచుకున్నారు. ఆమె నెలకొల్పుతున్న పార్టీ పేరును ‘ఆల్ ఇండియా పురట్చితలైవర్ మక్కళ్ మున్నేట్ర కజగం’(All India Puratchi Thalaivar Makkal Munetra Kazhagam) అని అనౌన్స్ చేశారు. అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురికావడంతో ఆమె ఇప్పుడు సొంత పార్టీ పెట్టుకుని ఆమె జయలలిత, ఎంజీఆర్, అన్నాదురై ఇమేజ్‌తో ప్రజల్లోకి వెళ్లనున్నారు.
పురట్చి తలైవర్ ఎంజీఆర్ బాటలో.. :
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి ఎంజీఆర్‌కు ప్రజల్లో ‘పురట్చితలైవర్’గా (విప్లవకారుడు) ఆదరణ ఉండేది. ఆయన చనిపోగానే అన్నాడీఎంకే పార్టీ పగ్గాలు చేపట్టిన జయలలిత ఆయన పేరునే ఆ పదంతోనే సంబోధించేవారు. ఆ రకంగా ఆమె పట్ల, పార్టీపట్ల ప్రజల్లో పాపులరిటీ పెరిగింది. ఆ పార్టీ ఐదుసార్లు అధికారంలోకి వచ్చింది. ఆమె ముఖ్యమంత్రి అయ్యారు. ఆమెను పురట్చితలైవి (విప్లవనాయకి) అనే పేరుతో ప్రజాదరణ పొందారు. జయలలిత చనిపోయిన తర్వాత అన్నాడీఎంకే నుంచి శశికళను (Sasikala) బహిష్కరించడంతో సొంత పార్టీ పెట్టుకోవడమే ఉత్తమం అనుకుని అటు జయలలిత, ఇటు ఎంజీఆర్ ఆదరణను చూరగొనేలా పురట్చితలైవర్ అనే పదాన్ని పార్టీ పేరులో పెట్టుకున్నారు. సినీ నటుడిగా విజయ్‌కు ఉన్న ఆదరణతో ఆమె పార్టీకి ఎలాంటి భవిష్యత్తు ఉంటుందనేది ఆసక్తికరం.
Read Also: మూసీ ప్రాజెక్ట్ DPR ఎక్కడ?: రేవంత్ కు హరీశ్ 8 ప్రశ్నలు
Follow Us On: X(Twitter)

