అనకాపల్లి చీడికాడ బీసీ బాలికల హాస్టల్‌లో అక్రమాలు

కలం, వెబ్ డెస్క్ : అనకాపల్లి (Anakapalli) జిల్లాలోని చీడికాడ (Cheedikada) బీసీ బాలికల వసతి గృహంలో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. విద్యార్థినులే సోషల్ మీడియా (Social Media) వేదికగా ఈ విషయాన్ని బయటపెట్టడం ఆందోళన కలిగిస్తోంది. హాస్టల్‌లో ప్రభుత్వం నిర్ణయించిన మెనూ అమలు చేయడం లేదని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. తినడానికి సరిపడా భోజనం పెట్టడం లేదని అడిగితే, మరుసటి రోజు బలవంతంగా ఎక్కువగా పెట్టి ఇబ్బంది పెడుతున్నారని వారు చెబుతున్నారు. సమస్య గురించి ప్రశ్నించిన విద్యార్థినులపై హాస్టల్ సిబ్బంది అసభ్య పదజాలంతో దూషిస్తున్నట్లు తెలిపారు.

అదే విధంగా, ఆదివారం రోజుల్లో కూడా ఇతర పనులు చేయమని చెబుతున్నట్లు విద్యార్థినులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు పోరాటం కొనసాగిస్తామని, ముఖ్యంగా మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) స్పందించే వరకు వెనక్కి తగ్గబోమని విద్యార్థినులు స్పష్టం చేస్తున్నారు. విద్యార్థినుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన వసతి గృహాల్లో ఇలాంటి పరిస్థితులు ఉండటం బాధాకరం. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి సమస్యలను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.

Read Also: ప్ర‌కృతి సేద్యంతో అద్భుతాలు.. గుంటూరు రైతుకు సీఎం ప్ర‌శంస‌లు!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>