Mobile Popup Ad
Mobile Popup Ad

శతకం అంచులో ఆగిన సంజూ శాంసన్.. 89 పరుగుల వద్ద ఔట్

కలం, వెబ్ డెస్క్:  ఇంగ్లండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో భారత స్పెషల్ ప్లేయర్ సంజూ శాంసన్ (Sanju Samson)  ఆరంభం నుంచి అదరగొట్టాడు. అంతా సెంచరీ పక్కా అనుకున్నారు. ఆ సమయంలో విల్ జాక్స్ బౌలింగ్ అనవసర షాట్ కొట్టి వికెట్ కోల్పోయాడు. వైడ్ క్రీజ్‌కు దగ్గరగా వెళ్తున్న బంతిని కదిలించి షాట్‌కు ట్రై చేయడంతో వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో శతకం దిశగా దూసుకెళ్లిన సంజూ.. 89 పరుగుల వద్ద ఔటై అభిమానులను నిరాశపరిచాడు. కేవలం 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సర్లతో అద్భుతంగా ఆడిన సంజూ, భారీ స్కోర్ వైపు వెళ్తున్న క్రమంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ విల్ జాక్స్ బౌలింగ్‌లో సంజూ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్యాచ్‌ను ఫిల్ సాల్ట్ పట్టడంతో సంజూ ఇన్నింగ్స్ ముగిసింది. అప్పటికే భారత్‌కు బలమైన పునాది వేసిన సంజూ, శతకం దిశగా సాగుతున్న ఇన్నింగ్స్‌ను మాత్రం పూర్తిచేయలేకపోయాడు. సంజూ వికెట్‌తో భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మైదానంలోకి అడుగు పెట్టాడు. మరి సూర్య ఏమాత్రం రాణిస్తాడో చూడాలి.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>