రాహుల్ చెప్పింది దీదీ వినలే.. అందుకే ఇలాంటి పరిస్థితి: సంజయ్ రౌత్

కలం, వెబ్ డెస్క్: వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ) ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించలేకపోవడంపై శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ (Sanjay Raut) స్పందించారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సూచనలను మమతా బెనర్జీ పాటించి ఉంటే ఫలితాలు మెరుగ్గా ఉండేవని ఆయన అభిప్రాయపడ్డారు. బెంగాల్‌లో ఇండియా కూటమిలో భాగంగా కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలతో కలిసి మమతా బెనర్జీ సీట్ల సర్దుబాటు చేసుకుని ఉంటే బీజేపీని మరింత సమర్థవంతంగా అడ్డుకునే అవకాశం ఉండేదని రౌత్ అభిప్రాయపడ్డారు.

మమతా బెనర్జీ (Mamata Banerjee) సొంతంగా పోటీ చేయాలని నిర్ణయించుకోవడం వల్ల ఓట్లు చీలిపోయాయని, ఇది పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చిందని తెలిపారు. ఎన్నికలకు ముందే రాహుల్ గాంధీ (Rahul Gandhi) కలిసికట్టుగా పోరాడాలని పిలుపునిచ్చారని.. కానీ, టీఎంసీ అధినేత్రి ఆ సూచనలను పరిగణనలోకి తీసుకోలేదని రౌత్ (Sanjay Raut) గుర్తు చేశారు.

Read Also: బీజేపీ కీలక నిర్ణయం.. బెంగాల్ కు మహిళ సీఎం.. !

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>