మలయాళ నటుడు సంతోష్ కే నాయర్ మృతి

కలం, వెబ్ డెస్క్: మలయాళ చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొన్నది. సీనియర్ నటుడు సంతోష్ కే నాయర్ (65) కేరళలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కన్నుమూశారు. కేరళలోని పతనంతిట్ట జిల్లా ఎనత్తు సమీపంలో సంతోష్ నాయర్ (Santosh K Nair) ప్రయాణిస్తున్న కారు ఎదురుగా వస్తున్న లారీని బలంగా ఢీకొట్టింది. మంగళవారం ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకున్నది.

ప్రమాద సమయంలో కారు స్టీరింగ్.. ఆయన (Santosh K Nair) ఛాతీకి బలంగా తగలడంతో గాయాలయ్యాయి. హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సమయంలో గుండెపోటు రావడంతో పరిస్థితి విషమించి మరణించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య శుభశ్రీ (రాజలక్ష్మి) కూడా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు తెలిపారు. నాలుగు దశాబ్దాల కెరీర్‌లో సంతోష్ కే నాయర్ 100కి పైగా చిత్రాలలో నటించారు.

Read Also: దీదీ రాజీనామా చేయకపోతే పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది?

Follow Us On :  WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>