కలం, వెబ్ డెస్క్: తెలంగాణ ప్రభుత్వ నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్న సంజయ్ జాజు (Sanjay Jaju) సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొత్త సీఎస్‌కు శుభాకాంక్షలు తెలిపి.. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. ఈ భేటీలో ఈ రోజు రిటైర్డ్ కాబోతున్న ప్రస్తుత సీఎస్ రామకృష్ణారావు కూడా ఉన్నారు.
మరికాసేపట్లో బాధ్యతల స్వీకరణ..
సంజయ్ జాజు మరికాసేపట్లో రాష్ట్ర సచివాలయానికి వెళ్లి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అనంతరం అన్ని శాఖల కార్యదర్శులతో సమీక్ష సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. తెలంగాణ ఏర్పాటయ్యాక తొలిసారి రాష్ట్ర సర్వీసుల్లోకి వచ్చిన సంజయ్ జాజు 1992 బ్యాచ్ ఐఏఎస్ అధికారి.
రామకృష్ణారావును సీఎం రేవంత్ రెడ్డికి సలహాదారు, ఎక్స్–అఫిషియో స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ప్రభుత్వం నియమించిన విషయం విదితమే. ఆయన రేపు కొత్త బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది.

