కలం, వెబ్ డెస్క్: టీ20 ప్రపంచ కప్ (T20 World Cup) 2026 ముగిసిన తర్వాత కూడా భారత్‌లోనే ఉండిపోయిన వెస్టిండీస్ జట్టు (West Indies Team), ఎట్టకేలకు స్వదేశానికి ప్రయాణమయ్యారు. చార్టర్డ్ ఫ్లైట్ రాకలో జాప్యం జరగడంతో, ప్రస్తుతం ఆటగాళ్లందరూ కమర్షియల్ ఫ్లైట్స్‌లో విడతల వారీగా బయలుదేరుతున్నట్లు సమాచారం. మార్చి 1న భారత్‌తో జరిగిన తమ చివరి సూపర్ ఎయిట్ మ్యాచ్ ముగిసినప్పటి నుండి విండీస్ జట్టు ఇక్కడే వేచి చూడాల్సి వచ్చింది. సాధారణంగా ఐసీసీ నిబంధనల ప్రకారం, ప్రపంచ కప్‌లో పాల్గొనే జట్ల ప్రయాణ, వసతి ఏర్పాట్ల బాధ్యతను ఐసీసీయే చూసుకుంటుంది. అయితే, వెస్టిండీస్, సౌత్ ఆఫ్రికా జట్ల కోసం ఏర్పాటు చేయాల్సిన చార్టర్డ్ ఫ్లైట్ పదే పదే ఆలస్యమైంది.
మ్యాచ్‌లు పూర్తయిన తర్వాత దాదాపు తొమ్మిది రోజుల పాటు విండీస్ జట్టు (West Indies Team) భారత్‌లోనే ఉండిపోయింది. మధ్యప్రాచ్యంలో నెలకొన్న ఉద్రిక్తతలు, విమానయాన నిబంధనల కారణంగా ఈ అనిశ్చితి నెలకొన్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితిపై ఆ జట్టు హెడ్ కోచ్ డారెన్ స్లామీ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ, త్వరితగతిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆటగాళ్ల భద్రత దృష్ట్యా ఇక చార్టర్డ్ ఫ్లైట్ కోసం వేచి చూడటం సరైనది కాదని క్రికెట్ వెస్టిండీస్ ఐసీసీకి స్పష్టం చేసింది. వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కోరడంతో, ఐసీసీ సహకారంతో కమర్షియల్ ఫ్లైట్స్‌లో సీట్లు కేటాయించారు. కొందరు ఆటగాళ్లు ఇప్పటికే బయలుదేరగా, మిగిలిన వారు మార్చి 10, 11 తేదీల్లో స్వదేశానికి చేరుకుంటారని బోర్డు తెలిపింది.
Read Also: ఆర్‌సీబీలో వెంకటేశ్ అయ్యర్‌కు చోటు లేదు : సంజయ్ బంగర్
Follow Us On: Facebook

