Mobile Popup Ad
Mobile Popup Ad

శివయ్య క్షేత్రాన్ని అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతాం

కలం, వలిగొండ: శివయ్య క్షేత్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వలిగొండ మండలంలోని సంగెం గ్రామం పరిధిలో గల భీమ లింగం (Bheemalingam) వద్ద నది మధ్యలోని భీమలింగం వద్దకు వెళ్లేందుకు రెండు కోట్లతో నిర్మించే వంతెన నిర్మాణానికి స్థలాన్ని అధికారులతో కలిసి ఎమ్మెల్యే పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి భీమ లింగానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. భీమలింగం (Bheemalingam) వద్దకు భక్తులు వెళ్లేందుకు ప్రత్యేకంగా రెండు కోట్లతో వంతెన నిర్మించడం జరుగుతుందని, అదేవిధంగా పార్కు సౌకర్యం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. భీమలింగం వద్ద అన్ని రకాల అభివృద్ధికి మూసీ రివర్ డెవలప్మెంట్ ఫ్రంట్ ద్వారా సహకరిస్తానని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని అన్నారు. అంతేకాకుండా మూసీ నదిపై బొల్లేపల్లి-సంగెం గ్రామాల మధ్య 45 కోట్లతో హై లెవెల్ వంతెన నిర్మాణానికి మరో 10 రోజులలో శంకుస్థాపన చేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, ఆర్ అండ్ బి, రెవెన్యూ, ఆర్కిటెక్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Read Also: భారత్ క్లాసిక్‌లో కోచర్, కార్తిక్ జోరు.. టైటిల్ రేసులోనే

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>