కలం, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan) నటించిన ‘పెద్ది’ (Peddi) మూవీ సూపర్ హిట్ కావడంతో మెగా కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తోంది. ఈ విజయాన్ని మరింత ప్రత్యేకంగా మార్చుతూ చరణ్ కుమార్తె ‘క్లింకార’ (Klin Kaara) తండ్రికి సర్‌ప్రైజ్ ఇచ్చిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. క్లింకార సహాయకులు చికిరీ పాటకు డాన్స్ చేస్తున్న ఈ వీడియోలో “లవ్ యు నాన్న” ఇది మీకోసమే అంటూ తన క్యూట్ వాయిస్‌తో తండ్రి రామ్ చరణ్‌కు స్పెషల్ విషెస్ తెలియజేసింది. ఈ ప్రత్యేక మోమెంట్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.
‘పెద్ది’ చిత్రంలో రామ్ చరణ్ నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. హై-ఎనర్జీ యాక్షన్ సీన్స్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్‌తో సినిమా బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. ఈ విజయంతో మెగా ఫ్యాన్స్ సంబరాలలో మునిగిపోగా, క్లింకార (Klin Kaara) నుంచి వచ్చిన ఈ చిన్న సర్‌ప్రైజ్ ఆ ఆనందాన్ని మరింత రెట్టింపు చేసింది.
Read Also: దేశవ్యాప్తంగా ‘నాగబంధం’ మూవీ అడ్వెంచర్ టూర్
Follow Us On : WhatsApp

