Mobile Popup Ad
Mobile Popup Ad

ఐరన్ మాత్రలు మింగిన ఆశ్రమ పాఠశాల బాలిక మృతి

కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం(Khammam) జిల్లా ముదిగొండ (Mudigonda) మండలంలోని వల్లభి ప్రభుత్వ బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న శ్వేత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయింది. హాస్టల్లో పని చేసే ఆయా.. బాలికను మానసికంగా వేధించడంతో ఈ నెల 9వ తేదీన బాలిక పదిహేను ఐరన్ మాత్రలు (Iron tablets) మింగి ఆత్మహత్యాయత్నం చేసిందని కుటుంబీకులు చెబుతున్నారు.

అదే రోజు పాఠశాల యాజమాన్యం శ్వేత అమ్మమ్మను పిలిపించి ఇంటికి పంపించారు. ఇంటికి వెళ్లిన దగ్గర్నుంచి బాలిక వాంతులు, కడుపు నొప్పితో బాధపడుతుండటం వలన ఖమ్మం (Khammam)లోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ నయం కాకపోవడంతో హైదరాబాద్‌‌లోని ఉస్మానియా ఆసుపత్రికి తీసుకెళ్లడం జరిగింది. అయినప్పటికీ శ్వేత కోలుకోలేదు. వారం రోజులు ప్రాణాలతో పోరాడి ఆదివారం తుది శ్వాస విడిచింది. బాలిక మరణానికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ మృతురాలి తల్లి కళ్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>