epaper
Wednesday, February 18, 2026
epaper

‘పుర’ పోలింగ్‌కు సర్వం సిద్ధం

కలం, మెదక్ బ్యూరో : రేపు జరగనున్న మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) పోలింగ్ సందర్భంగా సంగారెడ్డి (Sangareddy) జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో, స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకునేలా అన్ని స్థాయిల్లో ఏర్పాట్లు చేపట్టారు. సంగారెడ్డి, సదాశివపేట, కోహిర్, జహీరాబాద్, నారాయణఖేడ్, జిన్నారం, ఆందోల్ – జోగిపేట్, ఇస్నాపూర్, ఇంద్రేశం, గుమ్మడిదల, గడ్డపోతారం మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగనున్నాయి. సంగారెడ్డి జిల్లాలోని 11 మున్సిపాలిటీల్లో మొత్తం 256 వార్డులు ఉండగా, వాటికి గాను 541 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్‌ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 3,41,808 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు – 1,71,151. మహిళలు – 1,70,638. ఇతరులు – 19 ఉన్నారు.

పోలింగ్ నిర్వహణ కోసం జిల్లా (Sangareddy) లో 103 మంది రిటర్నింగ్ అధికారులు, 103 మంది అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారులు, 649 మంది ప్రిసైడింగ్ అధికారులు, 649 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు, 1,948 మంది ఇతర పోలింగ్ అధికారులు,73 మంది మైక్రో అబ్జర్వర్లు , 49 మంది జోనల్ ఆఫీసర్లను నియమించారు. ప్రశాంతంగా, సురక్షితంగా పోలింగ్ జరిగేలా శాంతిభద్రతలు కట్టుదిట్టంగా ఉండేలా ఏర్పాట్లు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద అవసరమైన మౌలిక వసతులు కల్పించి, ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

Read Also: ఓం బిర్లా సంచలన నిర్ణయం

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>