epaper
Monday, March 2, 2026
epaper

గ్రామాభివృద్ధిలో సర్పంచుల పాత్ర కీలకం : కలెక్టర్ ప్రావీణ్య

కలం, మెదక్ బ్యూరో : ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన పాలన అందించడంలో సర్పంచుల పాత్ర కీలకమని, ప్రభుత్వ పథకాలను క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేయడంపై సర్పంచులు దృష్టిపెట్టాలని, నూతనంగా ఎన్నికైన సర్పంచులు బాధ్యతా యుతంగా పనిచేసి గ్రామాభివృద్ధికి కృషి చేయాలని సంగారెడ్డి (Sangareddy) జిల్లా కలెక్టర్ ప్రావీణ్య (Collector Praveenya) తెలిపారు. సంగారెడ్డి మహిళా ప్రాంగణంలో నూతనంగా ఎన్నికైన సర్పంచులకు నిర్వహిస్తున్న ఐదు రోజుల శిక్షణా కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రావీణ్య (Collector Praveenya) మాట్లాడుతూ.. సర్పంచులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ సమస్యలను గుర్తించి తక్షణ పరిష్కారానికి చర్యలు చేపట్టాలని, ప్రజలతో మమేకమై బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. తాగునీరు, పారిశుధ్యం, రహదారులు, విద్య, వైద్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చే నిధులను సక్రమంగా వినియోగించి, ప్రాధాన్యత ఆధారంగా పనులు పూర్తి చేయాలని సర్పంచులకు పిలుపునిచ్చారు.

Read Also: డీసీసీ అధ్యక్షులకు రాహుల్ గాంధీ మార్షల్ ఆర్ట్స్ పాఠాలు

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!