చుంచుపల్లిలో రౌడీ మూకల హల్‌చల్… యువకుడిపై దాడి, కారు ధ్వంసం!

కలం, ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లి (Chunchupalli)  మండలంలో బుధవారం రాత్రి రౌడీ మూకలు రెచ్చిపోయాయి. విద్యానగర్ కాలనీకి చెందిన రాహుల్ అనే యువకుడిపై రామాంజనేయ కాలనీకి చెందిన సుమారు 10 మంది దుండగులు ఒక్కసారిగా దాడికి తెగబడ్డారు. ఈ క్రమంలోనే రాహుల్‌కు చెందిన కారు అద్దాలను వారు పూర్తిగా ధ్వంసం చేశారు.

​అంతటితో ఆగకుండా, నిందితులు రాహుల్‌ను బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని గాంధీ కాలనీకి తరలించారు. అక్కడ అతడిపై మరోసారి తీవ్రంగా దాడికి పాల్పడ్డారు. అనంతరం తీవ్రంగా గాయపడిన రాహుల్‌ను స్థానిక గ్యాస్ గోడౌన్ సమీపంలో వదిలేసి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. రౌడీ మూకల చేతిలో గాయపడిన బాధితుడు రాహుల్ ఈ ఘటనపై చుంచుపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. నివాస ప్రాంతాల్లో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తూ అరాచకానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని స్థానికులు కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>