ఎస్సీ ఉపకులాల నేతలతో కవిత కీలక భేటీ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఎస్సీ ఉపకులాల నేతలతో కీలక భేటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో జనాభా దామాషా ప్రకారం ఎస్సీ రిజర్వేషన్లను (SC Reservations) పెంచాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల పెంపునకు సంబంధించి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లోనే ప్రభుత్వం అధికారికంగా తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. ఎస్సీల్లోని అన్ని ఉపకులాలకు రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందాలన్నదే తమ లక్ష్యమని కవిత అన్నారు.

ఎస్సీ ఉపకులాలకు కేవలం విద్య, ఉద్యోగ రంగాల్లోనే కాకుండా రాజకీయంగా తగిన రిజర్వేషన్లు కల్పించాలని కవిత (Kavitha) పేర్కొన్నారు. అప్పుడే ఆయా వర్గాలకు నిజమైన సాధికారత లభిస్తుందని అభిప్రాయపడ్డారు. ఎస్సీ రిజర్వేషన్ల పెంపు కోసం దళిత సంఘాలతో కలిసి తెలంగాణ జాగృతి పెద్ద ఎత్తున ఉద్యమిస్తుందని కవిత వెల్లడించారు. అట్టడుగు వర్గాలకు సామాజిక న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని ఈ భేటీలో నేతలకు ఆమె హామీ ఇచ్చారు.

Read Also: మూటల కోసమే తెలంగాణకొచ్చారు.. రాహుల్‌పై బండి సంజయ్ ఫైర్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>