Mobile Popup Ad
Mobile Popup Ad

ఆ మొబైల్ సిగ్నల్ బూస్టర్లు వాడితే నేరమే..

కలం, డెస్క్ : ఈ రోజుల్లో చాలా మంది వైర్ లెస్ మొబైల్ సిగ్నల్ బూస్టర్లను (Mobile Signal Boosters) వాడేస్తున్నారు. అయితే ఇవి వాడటం చట్టరీత్యా నేరం అనే విషయం మర్చిపోతున్నారు. టెలికమ్యూనికేషన్ చట్టం 2023 ప్రకారం అనధికార వైర్‌లెస్ ట్రాన్స్‌సీవింగ్ పరికరాలు, పర్మిషన్ లేని మొబైల్ సిగ్నల్ బూస్టర్లను వాడటం నేరం అని వైర్ లెస్ మానిటరింగ్ ఆర్గనైజేషన్ డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలికాం చెబుతోంది. ఈ విషయం సాధారణ ప్రజలకు తెలియక ఆన్ లైన్ లో లేదా ఆఫ్ లైన్ లో కొనేసి వాడేస్తున్నారు. మొబైల్ సిగ్నల్ బాగా రావడం కోసం ఇలా చేస్తున్న వారు కోకొల్లలు.

అయితే ఇలా వైర్ లెస్ సిగ్నల్ బూస్టర్లను (Mobile Signal Boosters) వాడితే టెలికాం నెట్ వర్క్ లో అంతరాయాలు కలుగుతాయని అధికారులు చెబుతున్నారు. అలాగే టెలికాం కంపెనీల సేవల నాణ్యతను కూడా ఇది దెబ్బతీస్తుందంటున్నారు. అంతే కాకుండా దాని ఎఫెక్ట్ మొబైల్ ఫోన్ల మీద కూడా పడుతుందని వివరిస్తున్నారు. కాబట్టి ఎవరూ పర్మిషన్ లేని మొబైల్ సిగ్నల్ బూస్టర్లను వాడొద్దని టెలికాం సంస్థ హెచ్చరిస్తోంది.

Read Also: అలెర్ట్​.. ట్రెండ్​ మైక్రో అపెక్స్​ వన్​లో తీవ్ర లోపాలు!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>