కలం, వెబ్ డెస్క్: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత (Samantha) ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaaram) గురించి ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ కథను దర్శకురాలు నందినీ రెడ్డి మొదట హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi) కోసం సిద్ధం చేశారని సమంత స్వయంగా వెల్లడించారు. అయితే, సాయి పల్లవి అప్పట్లో ఇతర ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు కాలేదని చెప్పారు. ఇక ఆ కథలో కొన్ని కీలక మార్పులు చేసి, తన ఇమేజ్‌కి, బాడీ లాంగ్వేజ్‌కి తగినట్టుగా దర్శకురాలు నందినీ రెడ్డి ఈ కథను అద్భుతంగా మలిచారని సమంత పేర్కొన్నారు.
పూర్తిస్థాయి ఫిమేల్ లీడ్ యాక్షన్ ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సమంత కేవలం హీరోయిన్‌గా నటించడమే కాకుండా, స్వయంగా ప్రొడ్యూసర్‌గానూ వ్యవహరిస్తుండటం విశేషం. నటనతో పాటు నిర్మాణ బాధ్యతలను కూడా భుజాన వేసుకున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కూడిన ఈ మూవీని జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేస్తున్నారు. ఇక సమంత కూడా లాంగ్ గ్యాప్ తర్వాత టాలీవుడ్‌లోకి వస్తుండటంతో ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

