కలం, వెబ్ డెస్క్ : స్టార్ హీరోయిన్ సమంత (Samantha) తల్లి కాబోతుందని కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల ‘మా ఇంటి బంగారం’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ లో ఆమె బేబీ బంప్ తో ఉన్నట్లు కనిపించడంతో ఈ ప్రచారం ఊపందుకుంది. ఈ నేపథ్యంలోనే తన ప్రెగ్నెన్సీపై సమంత క్లారిటీ ఇచ్చేసింది.
హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో తాజాగా జరిగిన ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్‌లో తన ప్రెగ్నెన్సీ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ సమంత తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ మేరకు ఇంత మంచి సక్సెస్ వచ్చాక మీరు ఇంకెలాంటి సినిమాతో రాబోతున్నారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు సమంత జవాబిస్తూ.. తాను మరోసారి గ్యాప్ తీసుకోవాల్సి వస్తుందని, మెటర్నిటీ లీవ్ తీసుకోవాలని స్పష్టం చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. ఈ విషయం తెలిసి పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు రాజ్ నిడిమోరు, సమంత దంపతులకు సోషల్ మీడియా వేదికగా కంగ్రాట్స్ చెబుతున్నారు.

