విశాఖ‌లో ఘోర రోడ్డు ప్ర‌మాదం.. న‌లుగురు మృతి!

క‌లం, వెబ్‌డెస్క్‌: విశాఖ‌ప‌ట్నం (Visakhapatnam)లో ఆదివారం తెల్ల‌వారుజామున ఘోర రోడ్డు ప్ర‌మాదం జ‌రిగింది. ఆనందపురం-అనకాపల్లి హైవేపై ఓ కారు లారీని వేగంగా ఢీకొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే ప్రాణాలు కోల్పోయారు. మ‌రొకిరికి తీవ్ర గాయాల‌య్యాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లానికి చేరుకొని ప‌రిశీలించారు. గాయ‌ప‌డ్డ వ్య‌క్తిని చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. మృతులంతా గుంటూరు జిల్లాకు చెందిన వారుగా గుర్తించారు. మృతుల్లో ఒక బాలుడు కూడా ఉన్నాడు. బాధితులు శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలిలో శుభ‌కార్యానికి వెళ్తుండ‌గా ఈ ఘ‌ట‌న‌ జ‌రిగింది. కారు అదుపు త‌ప్ప‌డం వ‌ల్లే ప్ర‌మాదం జ‌రిగిన‌ట్లు పోలీసులు ప్రాథ‌మికంగా అంచ‌నా వేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>