సాయికృష్ణ మిస్సింగ్ కేసు.. సీఐను విచారించిన సిట్

కలం, వెబ్ డెస్క్ : ఏపీలో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ మిస్సింగ్​ కేసులో సిట్ దూకుడు పెంచింది. ఈ కేసులో అరెస్ట్ చేసిన సీఐ నాగరాజు (CI Nagaraju)ను సిట్ విచారణ చేసింది. దాదాపు 6 గంటల పాటు కొనసాగిన ఈ విచారణలో నాగరాజును సిట్ చీఫ్ రవి ప్రకాశ్ స్వయంగా విచారించారు. ఈ సందర్భంగా సాయికృష్ణ అరెస్టైన తేదీ, వివరాలపై సిట్ ఆరా తీసింది. టాస్క్‌ఫోర్స్ పాత్రపై ప్రశ్నలు సంధించింది.

అయితే సిట్ వేసిన ప్రశ్నలకు నాగరాజు సమాధానం చెప్పలేదని తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ మిస్సింగ్ పై నాగరాజు (CI Nagaraju) మౌనంగా ఉన్నారని సమాచారం అందుతోంది. కృష్ణ లంక (Krishnalanka) పోలీస్ స్టేష‌న్‌లో దాదాపు నెల రోజుల సీసీ టీవీ ఫుటేజ్‌ ఎలా మాయమైందని సిట్ అధికారలు ప్రశ్నించగా.. నాగరాజు నోరు మెదపలేదని వినికిడి. కాగా, ఈ కేసులో సీఐ నాగరాజును సిట్ అధికారులు రేపు రిమాండ్ కు తరలించనున్నారు.

Read Also: ఉద్యోగులకు భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>