ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధం.. హెలికాప్టర్​లో జగిత్యాలకు KCR

కలం, వెబ్ డెస్క్: రేపు జగిత్యాలలో (Jagtial) జరగనున్న ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైంది. సీనియర్ నేత జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్న సందర్భంగా నిర్వహిస్తున్న సభకు పార్టీ అధినేత కేసీఆర్ (KCR) హాజరుకానున్నారు. సోమవారం సాయంత్రం 4:45 గంటలకు ఎర్రవల్లి నివాసం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరనున్నారు. జగిత్యాల కలెక్టరేట్ సమీపంలోని హెలిప్యాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుండి నేరుగా పార్టీ కార్యాలయానికి చేరుకుని, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన ముఖ్య నాయకులతో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కేసీఆర్ భేటీ నిర్వహించనున్నారు.

సాయంత్రం 6 గంటలకు కేసీఆర్ పార్టీ కార్యాలయం నుంచి బయలుదేరి సభా ప్రాంగణానికి చేరుకుంటారు. ఈ బహిరంగ సభలో జీవన్ రెడ్డితో పాటు ఆయన అనుచరులకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించనున్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ ఇవ్వబోయే రాజకీయ ప్రసంగంపై ఉత్కంఠ నెలకొంది. పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ ఎత్తున తరలిరానుండటంతో జగిత్యాల మొత్తం గులాబీమయంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>