కలం, నిర్మల్: మామడ మండలంలోని సదర్మాట్ బ్యారేజ్ (Sadarmat Barrage) నుంచి పొన్కల్, మామడ, దిమ్మదుర్తి, కప్పన్ పల్లి గ్రామాలకు లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జి కూచాడి శ్రీహరి రావు కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి మంగళవారం వినతిపత్రం అందజేశారు.
ఆయా గ్రామాల రైతులకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు సదర్మాట్ బ్యారేజ్ నుంచి లిఫ్ట్ ఇరిగేషన్ పథకాన్ని మంజూరు చేసి, పనులను త్వరితగతిన ప్రారంభించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్ భీంరెడ్డి, నాయకులు కాలగిరి గంగారెడ్డి, నల్ల లింగారెడ్డి, పడాల శ్రీనివాస్, అన్వర్ ఉన్నారు.

