హఫీజ్‌పేట రైల్వేస్టేషన్ వద్ద అమానుషం.. మహిళపై హోంగార్డు దాష్టీకం!

కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్‌ (Hyderabad) లోని హఫీజ్‌పేట (Hafeezpet) రైల్వేస్టేషన్‌ సమీపంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. ఒక మహిళను హోంగార్డు దారుణంగా కొట్టి, జుట్టు పట్టుకుని ఈడ్చుకెళ్లిన అమానవీయ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

యూనిఫామ్ ధరించిన ఒక హోంగార్డు నడిరోడ్డుపై ఒక మహిళపై అమానుషంగా దాడిచేశాడు. ఆమెను కొట్టడమే కాకుండా, జుట్టుపట్టుకుని రోడ్డుపై ఈడ్చుకెళ్లాడు. ఆమె భర్త ఎంత ప్రాధేయపడినా కనికరం లేని హోంగార్డు పైశాచికంగా ప్రవర్తించాడు.

అయితే అక్కడ ఉన్న స్థానికులు ఈ దృశ్యాలను తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయింది. ఈ వీడియోలో హెంగార్డు తీరుపై తారాస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లు ఆడవాళ్లకు రక్షణ ఏది అంటూ ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>