కలం, వెబ్ డెస్క్: మిడిల్ ఈస్ట్ ఉద్రిక్తతల నడుమ భారత్ ఇంధన అవసరాలపై చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో రష్యా క్రూడాయిల్ (Russian Crude Oil) తీసుకొస్తున్న ‘ఆక్వా టైటన్’ అనే నౌక ఆదివారం మధ్యాహ్నం కర్ణాటకలోని మంగళూరుకు చేరుకుంది. యుద్ధం నేపథ్యంలో గ్లోబల్ ఇంధన ధరలను స్థిరీకరించేందుకు సముద్రంలో నిలిచిపోయిన రష్యా చమురును విక్రయించడానికి అమెరికా తాత్కాలిక అనుమతించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ నౌక భారత్‌కు చేరుకుంది.
ఆదివారం ఉదయం అమెరికాలోని టెక్సాస్ నుంచి ఎల్పీజీ తీసుకొచ్చిన ‘పైక్సిస్ పయనీర్’ (Pyxis Pioneer) కార్గో నౌక కూడా మంగళూరు పోర్టుకు (Mangalore Port) చేరుకుంది. దీనికి ముందు భారతదేశ జెండా కలిగిన ‘నందాదేవి’ ఎల్పీజీ ట్యాంకర్ గుజరాత్‌లోని వడినార్ పోర్టుకు చేరుకుంది. ఈ వారం పశ్చిమ తీరానికి చేరిన రెండో ఎల్పీజీ నౌక ఇదే కావడం గమనార్హం. అంతకుముందు ‘శివాలిక్’ నౌక ముండ్రా పోర్టుకు చేరింది. ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం కారణంగా హోర్ముజ్ జలసంధిలో సముద్ర రవాణా ప్రమాదకరంగా మారింది. ఈ పరిస్థితుల్లో ఈ నౌకలు సురక్షితంగా ప్రయాణించి భారత్‌కు అత్యవసరమైన ఎల్పీజీని తీసుకొచ్చాయి.
Read Also: ట్రంప్ వార్నింగ్‌కు ఇరాన్ కౌంటర్.. ఆ దేశాలకు ‘హర్మూజ్’ ఓపెన్
Follow Us On : WhatsApp

