epaper
Sunday, February 22, 2026
epaper

కూతురికి వీడియో కాల్ చేసి.. నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్య

కలం, మెదక్ బ్యూరో: రోజురోజుకూ ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. చాలామంది ఆర్థిక, వ్యక్తిగత కారణాలతో తీవ్ర మానసిక ఒత్తడికి గురవుతున్నారు. ఒంటరితనం, కుటుంబ కలహాలు, ఆత్మీయుల దూరం వేధిస్తోంది. తోటివారి ఆదరణ, ధైర్యం చెప్పే మనుషులు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సంగారెడ్డి (Sangareddy) జిల్లాలో ఓ ఆర్టీసీ డ్రైవర్ కూతురికి వీడియో కాల్ చేసి మరి ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపుతోంది.

జిల్లాలోని (Sangareddy) న్యాల్‌కల్ (మం) చాల్కి వద్ద మంజీరా నదిలో దూకి ఆర్టీసీ డ్రైవర్ పాపయ్య (49) ఆత్మహత్య చేసుకున్నాడు. నారాయణఖేడ్ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న పాపయ్య నది దగ్గరకు చేరుకొని కూతురికి వీడియో కాల్ చేశాడు. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పాడు. కూతురు వద్దని చెప్పినా నదిలో దూకి చనిపోయాడు. విషయం తెలుసుకున్న పోలీసులు నది ఒడ్డున డ్రైవర్ దుస్తులు, బైకు గుర్తించారు. ఆ తర్వాత డ్రైవర్ మృతదేహం బయటకు తీశారు. పాపయ్య స్వగ్రామం ఝరాసంగం మండలం కుప్పా నగర్. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Read Also: అజిత్ పవార్ మృతికి హెరిటేజ్‌కు లింక్: రోహిత్ పవార్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>