వేళకు రాని బస్సులు.. ప్రైవేట్ వాహనాల్లో విద్యార్థులు

కలం, జోగులాంబ గద్వాల: కేటి దొడ్డి (KT Doddi) మండలంలో గద్వాల, రాయచూర్ మధ్య నడిచే ఆర్టీసీ బస్సులు సమయపాలన పాటించకపోవడంతో ప్రయాణికులు, స్కూల్ విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. కేటి దొడ్డి మండలం ఉమిత్యాల, కేటి దొడ్డి, గువ్వలదిన్నె, పూజారితండా, తూర్పు తండా విద్యార్థులు నందిన్నె జడ్పీ పాఠశాలలో చదువుకుంటున్నారు. బస్సులు సమయానికి రాకపోవడంతో విద్యార్థులు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. సోమవారం సాయంత్రం నందిన్నె నుంచి కేటిదొడ్డి గ్రామానికి ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణిస్తూ.. ఇలా పుట్ బోర్డులపై ప్రమాదకరంగా వేలాడుతూ వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. ఆర్టీసీ అధికారులు స్పందించి వెంటనే బస్సుల సంఖ్యను పెంచి, సమయానికి నడపాలని ప్రజలు కోరుతున్నాన్నారు.

Also Read : నీళ్ల కోసం అదనపు కలెక్టర్ కాళ్లపై పడి వేడుకోలు

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>