నిర్మల్‌లో రవాణా శాఖ అధికారుల స్పెషల్ డ్రైవ్..

కలం, నిర్మల్ : పాఠశాలలు పునః ప్రారంభమైన సందర్భంగా విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని నిర్మల్ (Nirmal) జిల్లాలో ఆర్టీఏ అధికారులు సోమవారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నిర్మల్ లో ఆసిఫ్, బైంసా పట్టణంలో ఏఎంవీఐ రజనీకాంత్ తనిఖీలు చేపట్టారు. ఫిట్నెస్, సరైన పత్రాలు లేని విజేత హై స్కూల్, విజయ హై స్కూల్, గౌతమి హై స్కూల్, శ్రీ మేధా హై స్కూల్ కు చెందిన బస్సులను సీజ్ చేశారు. ఫిట్‌నెస్ లేకుండా పలు పాఠశాలల బస్సుల్లో విద్యార్థులను రవాణా చేస్తున్నట్లు గుర్తించారు. ప్రైవేట్ స్కూల్, కాలేజీ బస్సులు ఫిట్ నెస్ తప్పనిసరి అని సూచించారు. నిబంధనలు పాటించని వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు.

ఇంకా ఫిట్నెస్‌కు దూరంగా 93 బస్సులు..

నిర్మల్ జిల్లాలో అన్ని ప్రైవేటు పాఠశాలలు కలిపి 286 బస్సులు ఉన్నాయి. ఇందులో ఇప్పటివరకు 193 బస్సులకు మాత్రమే ఫిట్నెస్ చేయించారు. ఇంకా 93 బస్సులకు ఫిట్నెస్ పరీక్షలు చేయించకపోవడం గమనార్హం.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>