Mobile Popup Ad
Mobile Popup Ad

విడుద‌ల‌కు ముందే లాభాల్లోకి స‌మంత మూవీ!

క‌లం, వెబ్ డెస్క్‌: స్టార్ హీరోయిన్ స‌మంత (Samantha) ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన లేటెస్ట్ మూవీ మా ఇంటి బంగారం (Maa Inti Bangaaram). నందినీ రెడ్డి డైరెక్ష‌న్‌లో రూపొందిన ఈ సినిమా జూన్ 19న థియేట‌ర్ల‌లో గ్రాండ్‌గా విడుద‌ల కానుంది. స‌మంత సొంత బ్యాన‌ర్‌ ట్ర‌లాలా మూవీ పిక్చ‌ర్స్ నిర్మించిన ఈ సినిమా విడుద‌ల‌కు ముందే లాభాల బాట ప‌ట్టిన‌ట్లు తెలుస్తోంది. మా ఇంటి బంగారం నాన్ థియేట్రిక‌ల్ రైట్స్ రూపంలో రూ.35 కోట్లు రాబ‌ట్టుకున్న‌ట్లు సినీ వ‌ర్గాల్లో చ‌ర్చ న‌డుస్తోంది. ఇదే నిజ‌మైతే ఈ సినిమా పెట్టుబ‌డి మొత్తం ఓటీటీ, శాటిలైట్ రూపంలోనే వ‌చ్చేస్తుంది. ఇక సినిమా విడుద‌లయ్యాక‌ వ‌చ్చే ప్ర‌తి రూపాయి లాభ‌మే అనుకోవాలి.

ఇప్ప‌టికే స‌మంత యంగ్ స్టార్స్‌తో శుభం అనే సినిమా తీసి నిర్మాత‌గా హిట్ కొట్టింది. ఇక టాలీవుడ్‌లో చాలా రోజుల త‌ర్వాత స‌మంత న‌టిస్తున్న సినిమా కావ‌డంతో మా ఇంటి బంగారంపై భారీ అంచ‌నాలున్నాయి. ఇప్ప‌టికే స‌మంత మూవీ ప్ర‌మోష‌న్ల‌లో బిజీగా ఉంది. ప్ర‌స్తుతం స‌మంత సినిమాకు పెద్ద హీరోల మూవీస్ కూడా పోటీగా లేవు. దీంతో సినిమా స‌క్సెస్ అవ‌డం ఖాయ‌మ‌ని మూవీ టీం భావిస్తోంద‌ట‌. అలాగే విడుద‌ల ఆల‌స్యం చేసుకోవ‌డానికి స‌మంత కూడా ఇంట్రెస్టింగ్ రీజ‌న్స్ చెప్పుకొచ్చింది. కొద్ది రోజుల కింద‌టే మూవీని రిలీజ్ చేద్దామ‌నుకున్నా.. ఐపీఎల్ ముగిసే వ‌ర‌కూ ఆగుదామ‌ని స‌మంత చెప్పింద‌ట‌. మ‌రి ఇన్నాళ్లూ విడుద‌ల ఆపినందుకు మా ఇంటి బంగారం ఎలాంటి రిజ‌ల్ట్ ఇస్తుందో వేచి చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>