కలం, నిర్మల్: రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (RSS) శతాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో ఈ నెల 13న నిర్వహించనున్న హిందూ యువ సమ్మేళనాన్ని(Hindu Yuva Sammelan) విజయవంతం చేయాలని ఆర్ఎస్ఎస్ జిల్లా సంఘచాలక్ నూకల విజయ్ కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం సారంగాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని డిమార్ట్ ఎదురుగా ఉన్న ఎం.కె. కన్వెన్షన్ హాల్‌లో ఈ నెల 13న సాయంత్రం 5:30 గంటలకు హిందూ యువ సమ్మేళనం ప్రారంభమవుతుందని తెలిపారు.
15 నుంచి 35 ఏళ్ల వయస్సు గల విద్యార్థులు, యువకులు, మేధావులు, హిందూ సమాజంలోని ప్రతి ఒక్కరూ పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. యువతను పెద్ద సంఖ్యలో సమీకరించి సమ్మేళనాన్ని విజయవంతం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విభాగ సంపర్క్ ప్రముఖ్ శ్రీధర్, సంఘ ప్రముఖ్ శివశంకర్, జిల్లా కార్యవాహ బొద్దుల అశోక్, అల్లాడి సత్యనారాయణ, రాము, గంగాధర్, కరిపె విలాస్, ప్రకాష్, భీమన్న తదితరులు పాల్గొన్నారు.

