భారత్ ఎదగాలని ఏ శక్తి కోరుకోవడం లేదు: మోహన్ భాగవత్

కలం, వెబ్ డెస్క్: భారత్ అభివృద్ధిపై రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (RSS) చీఫ్ మోహన్ భాగవత్ (Mohan Bhagwat) కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలో ఏ శక్తి కూడా భారత్ అభివృద్ధి చెందాలని కోరుకోవడం లేదని అన్నారు. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని ప్రయత్నిస్తున్నాయని పేర్కొన్నారు. మహారాష్ట్రలోని ఛత్రపతి సంభాజీనగర్‌లో నిర్వహించిన ఐదవ పద్మ మహోత్సవ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.

ప్రపంచ దేశాలు ‘బలవంతుడిదే రాజ్యం’ అనే సూత్రాన్ని గట్టిగ నమ్ముతున్నాయని.. ఇతర దేశాలను తమ అధీనంలో ఉంచాలని చూస్తున్నాయని మోహన్ భాగవత్ చెప్పారు. భారత్ వేగంగా అభివృద్ధి చెందితే తమ ఆధిపత్యానికి సవాలు ఎదురవుతుందని కొన్ని దేశాలు భావిస్తున్నాయని చెప్పుకొచ్చారు. ప్రపంచంలో తమ దేశం మనుగడ సాగించాలంటే మిగితా దేశాలను తమ నియంత్రణలో ఉంచుకోవాలని, అణచివేయాలని, సాధ్యమైనంత దోచుకోవాలని భావిస్తున్నాయని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

అయితే భారతదేశం మాత్రం మిగితాదేశాల్లా కాకుండా తన అభివృద్ధితో పాటు ప్రపంచంలోని ఇతర దేశాల సంక్షేమాన్ని కూడా కోరుకుంటుందని మోహన్ భాగవత్ తెలిపారు. తమను ద్వేషించే దేశాలకు సైతం సహాయం చేసే ఆలోచనతో ఉందని చెప్పారు. ఆపత్కాలంలో శత్రుదేశాలకు సైతం సహాయం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం దేశ యువతలో బానిసత్వ మనస్తత్వం తగ్గిపోయిందన్నారు. దేశ యువతలో అబద్ధాలను వ్యతిరేకిస్తూ, దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దాలనే ఆకాంక్ష పెరుగుతోందని అన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>