కలం, కరీంనగర్: భారతీయ జనతా యువ మోర్చా తెలంగాణ (BJYM Telangana) రాష్ట్ర అధికార ప్రతినిధిగా కరీంనగర్‌కు చెందిన ఎడవెల్లి శశిధర్ రెడ్డి (Adavelli Shashidhar) నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు కుందే గణేష్ అధికారిక నియామక ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటూ రాష్ట్రంతో పాటు తమ ప్రాంతంలో పార్టీ బలోపేతం, విస్తరణకు అంకితభావంతో పనిచేయాలని సూచించారు.
ఈ సందర్భంగా శశిధర్ రెడ్డి మాట్లాడుతూ తనపై నమ్మకంతో రాష్ట్ర అధికార ప్రతినిధి బాధ్యతలు అప్పగించేందుకు సహకరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశంతో పాటు రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలో బీజేవైఎం, బీజేపీ బలోపేతానికి తనవంతుగా శాయశక్తులా కృషి చేస్తానని శశిధర్ రెడ్డి పేర్కొన్నారు.

