కలం, వెబ్‌డెస్క్: విజయవాడలో పంది ముఖం పోస్టర్లు (Pig Face Posters) హాట్ టాపిక్‌గా మారాయి. పాలకుడి ముఖం మారితే అధికార స్వభావం మారుతుందా? అంటూ సిటీలో గోడలపై కొన్ని పోస్టర్లు దర్శనమిచ్చాయి. ఇందులో పంది ముఖంతో ఉన్న ఓ మనిషి ఫోటోను ముద్రించి, దానికి ఇంట్రెస్టింగ్ క్యాప్షన్ జోడించి పెట్టారు. ఈ పోస్టర్ గోడలపై తాజాగా దర్శనమిచ్చినా.. ఇంతకు ముందే నవంబర్ 19వ తేదీన సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. సైలెంట్ పొలిటికల్ పార్టీ అనే ఎక్స్ హ్యాండిల్‌లో ఈ ఫోటోను పోస్ట్ చేశారు. ఇప్పుడు ఏకంగా సిటీలో గోడలపై దర్శనం ఇస్తుండటంతో ప్రజలు దీని గురించి ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు. ఇంతకీ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్టర్లు పెట్టారు? అసలు పోస్టర్లను ఎవరు అంటించారు? అనేది తెలియాల్సి ఉంది.
ఈ పోస్టర్‌ను సోషల్ మీడియాలో పోస్టు చేసిన వ్యక్తులు, విజయవాడలో గోడలపై అంటించిన వ్యక్తులు ఒక్కరేనా అనే అనుమానం కూడా కలుగుతోంది. పోలీసులు ఈ ఘటనపై సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. అయితే సైలెంట్ పొలిటికల్ పార్టీ ఎక్స్ ఖాతాలో ముందుగా పోస్ట్ అయిన నేపథ్యంలో ఏపీలో మరో కొత్త రాజకీయ పార్టీ ఏమైనా పుట్టుకొస్తుందా అని నెటిజన్లు చర్చించుకుంటున్నారు. ఇక ఫలానా రాజకీయ నాయకుడిని ఉద్దేశించి ఈ పోస్టర్ పెట్టి ఉండొచ్చు అని నెటిజన్లు తమతమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకైతే దీనిపై అధికారికంగా ఎలాంటి క్లారిటీ రాలేదు. పోలీసులు దర్యాప్తు చేపట్టి ఈ పోస్టర్ల వెనుక ఎవరున్నారన్నది కనిపెట్టాల్సి ఉంది.

