కలం, మహబూబ్ నగర్: విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటేనే బంగారు భవిష్యత్తు ఉంటుందని దేవరకద్ర మండల విద్యాధికారి పి.బలరాం, జడ్పీహెచ్ ఎస్ బాలికల ఉన్నత పాఠశాల స్కూల్ కాంప్లెక్స్ HM కె.నాగేంద్రమ్మ అన్నారు. అంతర్జాతీయ విద్యార్థుల దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని దేవరకద్ర (Devarkadra) మండలం లక్ష్మీపల్లి ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో (Laxmipally Schools) మంగళవారం ఏర్పాటు చేసిన ఏక రూప దుస్తులు, రాత పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ పెద్దమోని లక్ష్మీ ఆంజనేయులు, ఎంఈఓ బలరాం, స్కూల్ కాంప్లెక్స్ జి హెచ్ యం కె.నాగేంద్రమ్మలు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఎంఈఓ, సీహెచ్ఎంలు మాట్లాడుతూ.. విద్యార్థుల భవితకు విద్యా అవసరం అన్నారు. విద్యార్థులందరూ విధిగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని కోరారు. చదువుకుంటేనే హక్కులు, సమానత్వం, ఆరోగ్యం పై అవగాహన కలుగుతుందన్నారు. విద్యార్థుల చదువుకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తుందని అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరారు. ఇదిలా ఉండగా ప్రభుత్వ పరంగా సరఫరా చేసిన రెండవ జత ఏక రూప దుస్తులను విద్యార్థులకు ఉచితంగా పంపిణీ చేశారు.
కాగా పాఠశాల ఉపాధ్యాయులు పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర సోషల్ మీడియా కమిటీ సభ్యులు లయన్ అశ్విని చంద్రశేఖర్ ప్రాతినిధ్యం మేరకు భారత సేవాశ్రమ సంఘం సహకారంతో విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పెద్దమోని లక్ష్మీ ఆంజనేయులు, ఉప సర్పంచ్ కవిత నాగేశ్వర్ రెడ్డి, ఉన్నత, ప్రాథమిక పాఠశాలల హెచ్ఎమ్ లు కోటకద్ర మురళీధర్, ఎస్.కల్పన, ఉపాధ్యాయులు అశ్విని చంద్రశేఖర్, దోమ శంకర్,మదన్ మోహన్ కావాలి సుజాత, ఫాతిమా, వెంకట్రాములు, వార్డు మెంబర్ బోయ రాములు, విద్యాభిమానులు పెద్దమోని ఆంజనేయులు, ఆత్మకూరు నాగేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

