కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్, వారి కుటుంబ సభ్యులు, మంత్రి పొంగులేటి వారి కుటుంబ సభ్యుల భూములపై విచారణ చేయించాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ (RS Praveen Kumar) డిమాండ్ చేశారు. కేవలం ప్రతీకారం తీర్చువాలనే ఉద్దేశంతోనే బీఆర్ఎస్ నాయకుల భూములపై విచారణకు ఆదేశించారని ఆరోపించారు. సంబంధం లేని భూములను కూడా వివాదంలోకి లాగేలా కాంగ్రెస్ సర్కార్ కుట్ర చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ మేరకు కాంగ్రెస్ నాయకుల ఆస్తుల వివరాలను ఆధారాలతో సహా జతచేసి సీఎస్ సంజయ్ జాజుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లేఖ రాశారు. కాంగ్రెస్ నేతల భూములపై విచారణ జరపాలని కోరారు. సీఎస్‌కు ఆధారాలు కూడా పంపుతున్నామని.. విచారణ చేయకపోతే అన్ని రకాలుగా పోరాడతామని స్పష్టం చేశారు.

