సౌదీ ఎయిర్‌పోర్ట్‌పై క్షిపణి దాడి: 12 మంది మృతి!

కలం, వెబ్ డెస్క్ : సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై యెమెన్‌కు చెందిన ఇరాన్ మద్దతుగల హౌతీ తిరుగుబాటుదారులు దాడి (Riyadh Airport Attack)కి పాల్పడ్డారు. ఈ భయానక ఘటనలో కనీసం 12 మంది ప్రాణాలు కోల్పోగా, 300 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో అమెరికా పౌరుడితో పాటు పలు ఇతర దేశాల ప్రజలు ఉన్నారు. దాడి జరిగిన వెంటనే సౌదీ పౌర విమానయాన సంస్థ విమానాశ్రయ కార్యకలాపాలను తాత్కాలికంగా నిలిపివేసి భద్రతా చర్యలు చేపట్టింది.

యెమెన్ మౌలిక సదుపాయాలపై సౌదీ అరేబియా జరుపుతున్న వైమానిక దాడులకు నిరసనగానే తాము ఈ దాడి చేసినట్లు హౌతీ సీనియర్ నాయకుడు మహమ్మద్ అల్-బుఖైతీ వెల్లడించారు. ఇదిలా ఉండగా, యెమెన్‌లో సౌదీ జరిపిన దాడుల్లో సెప్టెంబర్ నుండి ఇప్పటివరకు అనేక మంది పౌరులు ప్రాణాలు కోల్పోయారని హౌతీ వర్గాలు తెలిపాయి.

ఈ ఉద్రిక్తతల మధ్య అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హౌతీలపై సౌదీ అరేబియా జరుపుతున్న సైనిక చర్యల్లో అమెరికా కూడా భాగస్వామ్యం అయ్యే అవకాశం ఉందనే సంకేతాలు ఇచ్చారు. పరిస్థితిని సమీక్షించి, త్వరితగతిన తగిన నిర్ణయం తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. ఈ వరుస దాడులు మిడిల్ ఈస్ట్‌లో ఆందోళనలకు దారితీస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>