ఇంద్రకీలాద్రిపై దసరా తొలిరోజే భక్తులకు చుక్కలు

కలం, వెబ్ డెస్క్ :  విజయవాడ ఇంద్రకీలాద్రిపై (Indrakeeladri Temple) దసరా ఉత్సవాల (Dasara Celebrations) తొలిరోజే సామాన్య భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అమ్మవారి దర్శనం కోసం ఉదయం 5 గంటలకే క్యూలైన్లలోకి వచ్చినప్పటికీ, ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డుకు కూడా చేరుకోలేకపోయామని భక్తులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు గంటలకు పైగా క్యూలైన్లలో వేచి ఉండాల్సి రావడంతో వృద్ధులు తీవ్ర అవస్థలు పడ్డారు. కనీసం మంచినీళ్లు కూడా అందుబాటులో లేకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. వీఐపీలకు అధిక ప్రాధాన్యం ఇస్తూ సామాన్య భక్తులను పట్టించుకోవడం లేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దసరా ఉత్సవాల తొలిరోజే ఈ పరిస్థితి ఎదురవడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>