Mobile Popup Ad
Mobile Popup Ad

పంత్‌కు రూ.12 కోట్ల కోత.. ఐపీఎల్‌లో అతిపెద్ద పే కట్స్ ఇవే!

కలం, వెబ్ డెస్క్ : ఐపీఎల్‌లో కోట్ల రూపాయల ఒప్పందాలు సాధారణమే. కానీ ఎంత పెద్ద స్టార్ ఆటగాడైనా ఫామ్ లేకపోతే భారీ వేతన కోత తప్పదని మరోసారి రుజువైంది. తాజాగా రిషభ్ పంత్‌కు అదే పరిస్థితి ఎదురైంది. లక్నో సూపర్ జెయింట్స్‌తో నిరాశాజనకంగా సాగిన రెండేళ్ల తర్వాత అతను ఢిల్లీ క్యాపిటల్స్‌కు తిరిగి చేరగా, ఏకంగా రూ.12 కోట్ల వేతన కోత పడింది. ఐపీఎల్ 2025కు ముందు జరిగిన ఆటగాళ్ల ఎంపికలో రిషభ్ పంత్‌ను లక్నో సూపర్ జెయింట్స్ రూ.27 కోట్ల రికార్డు ధరకు కొనుగోలు చేసింది. అప్పటివరకు ఐపీఎల్ చరిత్రలో అత్యంత ఖరీదైన ఆటగాడిగా అతను నిలిచాడు. అయితే కెప్టెన్‌గా, బ్యాటర్‌గా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు.

2025 సీజన్‌లో పంత్ 269 పరుగులు చేయగా, 2026లో 312 పరుగులు మాత్రమే సాధించాడు. అతని నాయకత్వంలో లక్నో జట్టు ఏడో స్థానం నుంచి చివరికి పాయింట్ల పట్టికలో అట్టడుగుకు పడిపోయింది. దీంతో 2027 సీజన్‌కు ముందు జరిగిన కీలక ట్రేడ్‌లో లక్నో అతన్ని విడిచిపెట్టగా, ఢిల్లీ క్యాపిటల్స్ రూ.15 కోట్లకు తిరిగి జట్టులోకి తీసుకుంది. దీంతో పంత్ వేతనం రూ.27 కోట్ల నుంచి రూ.15 కోట్లకు పడిపోయింది. మొత్తంగా అతనికి రూ.12 కోట్ల కోత పడింది. ఇది ఐపీఎల్ చరిత్రలో అత్యంత భారీ వేతన కోతల్లో ఒకటిగా నిలిచింది. అయితే ఈ జాబితాలో పంత్ ఒక్కడే కాదు. ఇంకాచాలా మంది ప్లేయర్లు ఉన్నారు.

వెంకటేష్ అయ్యర్:

2025లో కోల్‌కతా నైట్ రైడర్స్ నుండి 23.75 కోట్ల రూపాయలు తీసుకున్న అయ్యర్, మరుసటి ఏడాది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు వచ్చేసరికి కేవలం 7 కోట్ల రూపాయలకే పరిమితమయ్యాడు. (తగ్గిన ధర: రూ. 16.75 కోట్లు)

మిచెల్ స్టార్క్:

24.75 కోట్ల రూపాయల నుండి 11.75 కోట్ల రూపాయలకు పడిపోయాడు. (తగ్గిన ధర: రూ. 13 కోట్లు)

శామ్ కరన్:

పంజాబ్ కింగ్స్ లో 18.5 కోట్ల రూపాయలు పలికిన కరన్, తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ కి వచ్చేసరికి కేవలం 2.4 కోట్ల రూపాయలకే దక్కాడు. (తగ్గిన ధర: రూ. 16.1 కోట్లు)

కైల్ జేమీసన్:

15 కోట్ల రూపాయల భారీ ధర నుండి ఏకంగా 1 కోటి రూపాయల బేస్ ప్రైస్‌కు పడిపోయాడు. (తగ్గిన ధర: రూ. 14 కోట్లు)

జై రిచర్డ్సన్:

14 కోట్ల రూపాయల నుండి 1.5 కోట్ల రూపాయలకు ఇతని విలువ తగ్గిపోయింది. (తగ్గిన ధర: రూ. 12.5 కోట్లు)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>