కలం, వెబ్ డెస్క్: డ్రగ్స్ (Drugs) కేసులో ఎంత పెద్ద వారున్నా వదిలిపెట్టబోమని సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) హెచ్చరించారు. సెలెబ్రిటీలైనా సరే.. నడిరోడ్డుపై వారిని నిలదీయాల్సిందేనని స్పష్టం చేశారు. గంజాయి మత్తులో మహిళలపై దాడులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. భయం, బాధ్యత లేనప్పుడే విచ్చలవిడితనం పెరుగుతుందన్నారు. డ్రగ్స్ నియంత్రణ విషయంలో తాను దేన్నీ లెక్కచేయనని.. ఎవరినీ పట్టించుకోనని తేల్చి చెప్పారు. పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు డ్రగ్స్ నియంత్రణ జరగాల్సిందే అన్నారు. మహిళల రక్షణ కోసం గంజాయి నియంత్రణ తప్పదని వివరించారు.
Read Also: ఖమ్మం కలెక్టర్ల బదిలీ.. ఆ ముగ్గురే కారణమా?
Follow Us On: WhatsApp

