ఆర్జీయూకేటీ-ఏపీ బీటెక్ అడ్మిషన్లకు ప్రొవిజనల్ లిస్ట్ విడుదల

కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ (RGUKT-AP)లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఆరు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీటెక్ కోర్సు ప్రవేశాల కోసం ప్రొవిజనల్ సెలెక్షన్ లిస్ట్‌ను విడుదల చేసినట్లు రాష్ట్ర ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) వెల్లడించారు. నూజివీడు, ఆర్‌కే వ్యాలీ, ఒంగోలు, శ్రీకాకుళం క్యాంపస్‌లలో అడ్మిషన్ల కోసం మొత్తం 44,104 దరఖాస్తులు అందగా, అందులో 4,040 మంది విద్యార్థులను తాత్కాలికంగా ఎంపిక చేసినట్లు తెలిపారు.

ఎంపికైన అభ్యర్థులలో 96.7 శాతం మంది ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులే కావడం గమనార్హమని, గ్రామీణ ప్రాంతాల ప్రతిభను ప్రోత్సహించడం, నాణ్యమైన ఉన్నత విద్య అందించడంలో RGUKT కట్టుబడి ఉందని లోకేశ్ పేర్కొన్నారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలుపుతూ, వారి భవిష్యత్ విద్యా ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. సెలెక్షన్ లెటర్స్ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను (rgukt.in) సందర్శించవచ్చని, అలాగే సహాయం కోసం వాట్సాప్ హెల్ప్‌డెస్క్ నంబర్ 9552300009ను సంప్రదించవచ్చని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>