కలం/ఖమ్మం బ్యూరో : భద్రాద్రి కొత్తగూడెం (Bhadradri Kothagudem) జిల్లాలో ఇటీవల కాలంలో లొంగిపోయిన 27 మంది మావోయిస్టు పార్టీ సభ్యులకు ఎస్పీ రోహిత్ రాజ్ రూ.62.5 లక్షల చెక్కులను అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ…ఈ రివార్డ్ ను వారి పునరావాసం కోసం అందజేశామన్నారు. లొంగిపోయినవారు ఈ డబ్బును ఉపయోగించుకొని జీవితంలో నిలదొక్కుకునే దిశగా ప్రయత్నించాలని సూచించారు. జిల్లా పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఇంకా ప్రభుత్వం తరఫున అందవలసిన అన్ని రకాల ప్రతిఫలాలు త్వరితగతిన అందేలా చర్యలు తీసుకుంటామని ఎస్పీ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఆపరేషన్స్ నరేందర్, ఆర్ఐ ఆపరేషన్స్ రవి తదితరులు పాల్గొన్నారు.

