మోడల్ కాలనీగా వెలుగుమట్లను తీర్చిదిద్దుతాం: మంత్రి తుమ్మల

కలం, ఖమ్మం బ్యూరో: రాష్ట్రంలోనే మోడల్ కాలనీగా వెలుగుమట్ల (Velugumatla)ను తీర్చిదిద్దుతామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. గురువారం వెలుగుమట్ల భూదాన్ భూముల్లో 38 ఇండ్ల నిర్మాణ పనులకు పోలీస్ కమిషనర్ సునీల్ దత్, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి లతో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ.. కొంతమంది దళారులు ఫేక్ డాక్యుమెంట్లతో పేదలకు భూములు అప్పగించారని ఆరోపించారు. ఎనిమిదేండ్లలో కనీస వసతులు లేకుండా పేదలు ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం భూదాన్ భూములను స్వాధీనం చేసుకున్నామన్నారు.

మోడల్ కాలనీగా వెలుగు మట్లను తీర్చి దిద్దుతామని, సోనియాగాంధీ పుట్టిన రోజు డిసెంబర్ 9 నాటికి ఇండ్ల నిర్మాణాలను పూర్తి చేస్తామని తుమ్మల (Minister Thummala Nageswara Rao) తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వర రావు, ఖమ్మం మున్సిపల్ కమిషనర్ అభిషేక్ అగస్త్య, పబ్లిక్ హెల్త్ ఈఈ రంజిత్, హౌజింగ్ పీడీ శ్రీనివాస్ పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>