హైదరాబాద్ మియాపూర్‌లో ప్రైవేట్ మినీ బస్సు బోల్తా

కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని మియాపూర్ (Miyapur)  ప్రాంతంలో ప్రైవేట్ మినీ బస్సు(Private Mini Bus) బోల్తా పడిన ఘటన కలకలం రేపింది. కూకట్‌పల్లి నుంచి గడ్డపోతారం వైపు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. లీ ఫార్మా కంపెనీకి చెందిన ఈ బస్సు బాచుపల్లి సమీపంలో మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో బోల్తా పడింది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పది మంది ఉద్యోగులకు గాయాలు అయ్యాయి. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన వారిని వెంటనే సమీప హాస్పిటల్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>