Mobile Popup Ad
Mobile Popup Ad

తెలంగాణలో డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

కలం, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలో 14 మంది డిప్యూటీ కలెక్టర్లు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూశాఖ (Revenue Department) ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు యాదాద్రి భువనగిరి ఎస్‌‌‌‌‌‌‌‌డీసీగా పనిచేస్తున్న బి. జయశ్రీ రాజన్న సిరిసిల్ల జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో)గా నియామకం అయ్యారు. ఇబ్రహీంపట్నం ఆర్డీవో కె. అనంత రెడ్డిని రంగారెడ్డి జిల్లా డీఆర్వోగా బదిలీ చేశారు. ప్రమోషన్ పొందిన ఎం. దేవదాస్‌‌‌‌‌‌‌‌ను నిర్మల్ ఆర్డీవోగా, డి. శ్రీధర్ బాబును సిరిసిల్ల ఆర్డీవోగా నియమించారు. మహబూబాబాద్ ఆర్డీవో కాసుల కృష్ణవేణిని ములుగు ఆర్డీవోగా, ఎస్‌‌‌‌‌‌‌‌డీసీ ఎం. రాజేశ్వరిని మహబూబాబాద్ ఆర్డీవోగా బదిలీ చేశారు. రంగారెడ్డి ఎస్‌‌‌‌‌‌‌‌డీసీ వై. శ్రీనివాస్ రెడ్డిని ఇబ్రహీంపట్నం ఆర్డీవోగా నియమించారు.

పదోన్నతి పొందిన కె.సి. ప్రమీలను యాదాద్రి భువనగిరి ఎస్‌‌‌‌‌‌‌‌డీసీగానియామకం అయ్యారు. వెయిటింగ్‌‌‌‌‌‌‌‌లో ఉన్న కె. నారాయణను హైదరాబాద్ డీఆర్వోగా, లా ఆఫీసర్ డి. శ్రీధర్‌‌‌‌‌‌‌‌ను రాజేంద్రనగర్ ఆర్డీవోగా బదిలీ చేశారు. హన్మకొండకు చెందిన తహసీల్దార్ జి. సదానందంను ఖమ్మం ఐపీటీ అండ్ రైల్వే ఎస్‌‌‌‌‌‌‌‌డీసీగా బదిలీ చేశారు. రాజేంద్రనగర్ ఆర్డీవోగా ఉన్న కొప్పుల వెంకట్ రెడ్డికి పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా పదోన్నతి కల్పించారు. ఈ బదిలీల్లో ఇటీవల సస్పెన్షన్‌‌‌‌‌‌‌‌కు గురై, ప్రస్తుతం తిరిగి విధుల్లోకి చేరిన ఎం. షర్మిలను కరీంనగర్ ఆర్డీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>