కలం, వెబ్ డెస్క్ : హైదరాబాద్‌లోని వెంగళరావు నగర్(Vengal Rao Nagar) లో హైడ్రా (HYDRAA) అధికారులు చేపట్టిన కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తతకు దారితీశాయి. రెండెకరాల వివాదాస్పద స్థలంలో ఉన్న నిర్మాణాలను భారీ పోలీస్ బందోబస్తు మధ్య కూల్చివేశారు. స్థలానికి సంబంధించిన వివాదం నేపథ్యంలో నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైన వెంటనే అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చుట్టుపక్కల ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసి, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకున్నారు. తాము 60 ఏళ్లుగా ఇక్కడే నివసిస్తున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

