epaper
Sunday, February 22, 2026
epaper

చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం: రేవంత్ రెడ్డి

కలం, వరంగల్ బ్యూరో: ‘చంద్రబాబుకు మేమెందుకు సహకరిస్తాం. తెలంగాణ ప్రయోజనాలే మాకు ముఖ్యం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy)  వ్యాఖ్యానించారు. సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని బీఆర్ఎస్ ఆరోపిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యలకు ప్రాధాన్యం సంతరించుకున్నది. ఆదివారం ములుగు జిల్లా కన్నాయిగూడెంలో దేవాదుల పనులు పరిశీలించిన ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు.

చంద్రబాబుకు సహరిస్తున్నామని బీఆర్ఎస్ నాయకులు చౌకబారు విమర్శలు చేస్తున్నారని Revanth Reddy ఫైర్ అయ్యారు. అక్కడ సెటిల్ అయిన వారికి మేమేందుకు సహకరిస్తామని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల వారితో చర్చించి తెలంగాణ నీటి హక్కులు కాపాడుకుంటామన్నారు. ప్రతిపక్ష నేతలు విలువైన సూచనలిస్తే స్వీకరిస్తామన్నారు. బీఆర్ఎస్ నేతలు వారి తప్పిదాలు కప్పిపుచ్చుకునేందుకు మా మీద విమర్శలు చేయడం తగదన్నారు.

‘మీ అంత జ్ఞానవంతులమని చెప్పడం లేదని, మీరు సూచనలు చేస్తే తప్పకుండా స్వీకరిస్తాం. కాళేశ్వరం ప్రాజెక్టును వదిలేయకుండా ఉపయోగంలోకి తెస్తామని సీఎం చెప్పారు. గోదావరి నది జలాలపై అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో చర్చిద్దామన్నారు. ప్రాజెక్టులు పూర్తి చేద్దామంటే నిధుల కొరత వచ్చిందని, రాబోయే రెండేళ్లలో ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తామని సీఎం స్పష్టం చేశారు. త్వరలోనే అన్ని నిధులను విడుదల చేస్తాని, దేవాదుల ప్రాజెక్టు 2001లో రూ. 6 వేల కోట్ల అంచనాతో మొదలై 18,500 వేల కోట్లకు అంచనాలు పెరిగాయన్నారు.

కాళేశ్వరం మహా అద్భుతం అన్నారు. మేము వచ్చినప్పటి నుంచి ఒక్కచుక్క ఎత్తిపోయలేదని, అయినా దేశంలోనే అత్యధిక వరి ఉత్పత్తి జరిగిందన్నారు. ఈ సమావేశంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, సీతక్క, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి ఉన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>