జిన్ పింగ్, పుతిన్ లతో ట్రంప్ కీలక భేటీ !

కలం, వెబ్ డెస్క్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఇరాన్ తో యుద్ధం ముగింపుపై కీలక ప్రకటన చేశారు. వచ్చే వారం చైనాలో జరగనున్న ఆసియా-పసిఫిక్ ఆర్థిక సహకార (APEC) శిఖరాగ్ర సమావేశం సందర్భంగా చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లతో భేటీ కానున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో ఇరాన్‌ తో కొనసాగుతున్న యుద్ధాన్ని ముగించే అంశంతో పాటు అణు నిరాయుధీకరణపై చర్చించనున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు.

నవంబర్ 18, 19 తేదీల్లో చైనాలోని షెన్‌జెన్ నగరంలో జరగనున్న APEC సదస్సుకు హాజరుకానున్నట్లు ట్రంప్ తెలిపారు. పుతిన్, షీ జిన్‌పింగ్‌లతో జరిగే భేటీలు ఆసక్తికరంగా ఉంటాయన్నారు. అణు నిరాయుధీకరణతో పాటు పలు అంతర్జాతీయ అంశాలపై చర్చించనున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా ఇరాన్‌తో కొనసాగుతున్న ఉద్రిక్తతలకు ముగింపు పలికేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తున్నామని ఆయన (Donald Trump) చెప్పారు. ట్రంప్ తాజా ప్రకటనతో చైనా, రష్యా, అమెరికా దేశాధినేతల సమావేశంలో అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>